![]() |
![]() |

సాధారణంగా ఐపీఎల్ మొదలైందంటే చాలు, సినిమా థియేటర్లు వెలవెలబోతాయి. పెద్ద హీరోల సినిమాలు కూడా ఐపీఎల్ సీజన్లో విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతుంటారు. కానీ, రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) మాత్రం ఇందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఐపీఎల్ ఫీవర్ ఒకవైపు ఉన్నప్పటికీ, థియేటర్ల వద్ద ఈ సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఐపీఎల్ ఇంపాక్ట్ ఎంత?
సాధారణంగా సాయంత్రం వేళల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల వల్ల థియేటర్ల ఆక్యుపెన్సీ 20-30% తగ్గుతుంటుంది. అయితే 'ధురంధర్ 2' విషయంలో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. సెకండ్ వీకెండ్లో కూడా ఈ సినిమా శనివారం రూ. 62 కోట్ల నెట్, ఆదివారం రూ. 68 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం.
ఐపీఎల్ సీజన్ లో కూడా ఒక సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇండియన్ సినీ చరిత్రలో అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన కంటెంట్, రణవీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను క్రికెట్ వదిలి థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాయి. మూడు గంటల కంటే ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ, ఆదిత్య ధర్ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తోంది.
రికార్డుల సునామీ: 11 రోజుల్లోనే రూ. 1365 కోట్లు!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్, మొదటి భాగం (Dhurandhar 1) సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం 11 రోజుల్లోనే అధిగమించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1,365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో ఇప్పటిదాకా రూ. 867 కోట్ల నెట్ రాబట్టింది. విదేశాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాహుబలి 2 పేరిట ఉన్న పాత రికార్డులను సైతం తుడిచిపెట్టేసి, అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
తెలుగులో ఈ సినిమా రెండు రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకి గట్టి పట్టు కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు సుమారు రూ. 25-30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా మరికొన్ని రోజుల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని కూడా సవాల్ చేసేలా కనిపిస్తోంది. ఐపీఎల్ ఫైనల్స్ వచ్చేలోపు ధురంధర్ 2 మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
![]() |
![]() |